Summer warming whites Vattiverlu
Whitewater is great for health. They are rich in nutrients such as iron, manganese and vitamin-B6. Whitewater reduces the severity of fever. Good for people with heart disease and those with chronic diseases. Controls the burning of the eyes. Prevents sweatpants. Vatti roots squeeze. There are many types of relief in burning sun. During the summer, whitewater is diluted with water to avoid body heat. The whitewater should be thoroughly washed and shredded and soaked overnight. In the morning, mix the juice in the mix and heat it. Add this juice to the jaggery and add the lemon juice. Drinking this water can be good for health. The scent that comes from it calms the mind. The aromatic oils of the roots are delicious. Ayurvedic experts say that whitewater can be made into a pancake and boost immunity.
వట్టివేర్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఇనుము, మాంగనీస్, విటమిన్-బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వట్టివేర్లు జ్వ రం తీవ్రతను తగ్గిస్తుంది. హృద్రోగులకు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవాళ్లకు మంచిది. కళ్ల మంటలను నియంత్రిస్తుంది. చెమటకాయలని అడ్డుకుంటాయి. వట్టి వేర్లు చలువ చేస్తాయి. మండే ఎండల్లో ఎన్నోరకాలుగా ఉపశమనం అందిస్తాయి. వేసవి కాలంలో వట్టివేర్లను నీటిలో వేసుకుని ఆ నీటిని సేవించడం ద్వారా శరీర వేడిని దూరం చేస్తాయి. వట్టివేర్లను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకుని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి వచ్చిన రసాన్ని వడకట్టి వేడిచేయాలి. బెల్లంపాకం పట్టి దాంట్లో ఈ రసం వేసి కలిపి చివరగా నిమ్మరసం పిండాలి. ఈ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటి నుంచి వచ్చే సువాసన మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. వేర్లలోని సుగంధతైలాలు రుచికరంగా ఉంటాయి. వట్టివేర్లను పానకంలా తయారుచేసి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.