Detox Drinks To Cleanse Your Body - మీ శరీరాన్ని ఇలా క్లీన్ చేసుకోండి, 80కి పైగా రోగాలను నివారించుకోండి
ఇంటిలో ఉండే చెత్తను శుభ్రం చేసుకోకపోతే ఎంత అనారోగ్యమో, శరీరంలో చెత్తను శుభ్రం చేసుకోకపోయినా ఆరోగ్యానికి అంతే ప్రమాదం. చిన్న అనారోగ్యాలనుండి మొదలయి మొత్తం శరీరంలోని అవయవాలకు చేటు చేస్తాయి. శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. బయటదొరికే జంక్ ఫుడ్, ఆల్కహాల్, సిగరెట్లు, ఇంట్లో లేదా బయట దొరికే నూనెలో వేయించిన పదార్థాలు తినడం వలన ఇందులో ఉండే చెడుపదార్థాలు అనేక అనారోగ్యాలకు కారణమవుతాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
దీనివలన మొటిమలు, మచ్చలు, జుట్టురాలడం, కంటి సమస్యలు, అధికబరువు, రోజంతా బద్ధకంగా ఉండడం శక్తి తగ్గిపోవడం, చర్మంపై దద్దుర్లు, గుండె, కాలేయం, కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయి. శరీరంలో విషపదార్థాలు కల్తీ పదార్థాలు తయారు చేయడం, పండించేటప్పుడు పురుగుల మందులు చల్లడం వలన చేరుతున్నాయి.వీటిని ఆపడం మన వలన కాదు మరియు అసంభవం. పండించేటప్పుడు పురుగుల మందులేకాకుండా త్వరగా పండ్లుగా మారేందుకు ఇంజక్షన్లు ఇస్తున్నారు. మన శరీరాన్ని శుభ్రం చేయడానికి మూత్రం, చెమటరూపంలో బయటకు పంపిస్తాయి. కానీ పూర్తి స్థాయిలో కాదు. మరి పూర్తిగా శరీరాన్ని విషపదార్థాల రహితంగా చేయడానికి ఏంచేయాలో చూద్దాం
అలోవెరా జ్యూస్ :కలబంద జ్యూస్లో లాక్సెటివ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీనివలన జీర్ణశక్తికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ వలన శరీరంలో కొవ్వు పెరగకుండా ఆపుతుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణశక్తిని పెంచడానికి, చర్మం కాంతివంతంగా ఉండడానికి అలొవెరాని ఆహరంలో భాగం చేసుకోవాలి
గోధుమ గడ్డి రసం :- దీనిలో ఎన్నో పోషకపదార్థాలు ఉంటాయి. ఇందులో బీటాకెరొటిన్, విటమిన్ వి,సి,90 రకాల మినరల్స్, 18 రకాల ఎమినో యాసిడ్, నిండిఉంటాయి. పాలకూరలో ఉండే ఐరన్ కంటే ఎక్కువ శాతం ఐరన్ ఉంటుంది. మరియు ఇందులో 70శాతం క్లోరోఫిల్ ఉంటుంది. వారానికి మూడు రోజులు అంటే రోజు మార్చి రోజూ తీసుకోవాలి. రక్తప్రసరణ మెరుగుపడి గుండె జబ్బులు తగ్గుతాయి. దీనివలన రక్తం శుద్ధి జరిగి మొటిమలు మచ్చలు తగ్గుతాయి. అధికబరువును కూడా తగ్గిస్తుంది.
బీట్రూట్ :- బీట్రూట్లో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి .దీనిని ఆహారం లో ఎక్కువగా తీసుకుంటే శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేస్తాయి.
గ్రీన్ టీ :- సహజమైన గ్రీన్ టీ కషాయం శరీరాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే కొబ్బరినీళ్ళు కూడా శరీరాన్ని శుభ్రపరుస్తాయీ. శరీరంలో ఎంత తిన్నా నీరసంగా ఉంటుంటే ఆపిల్ సిడార్ వెనిగర్ని నీళ్ళలో కలిపీ తీసుకోవడం కూడా శరీరం శుభ్రపడడానికి సహాయపడుతుంది. అలాగే రోజూ నలభై నిమిషాల నడక వ్యాయామం కూడా శరీరాన్ని శుభ్రపరిచి, ఆరోగ్యానికి సహాయపడుతుంది
English
Keep your body clean and prevent over 80 diseases
Just as it is unhealthy not to clean the garbage in the house, it is just as dangerous to health if the garbage in the body is not cleaned. Starting with minor ailments and harming the organs of the whole body. Regular cleansing of the body can keep you healthy. Eating junk food, alcohol, cigarettes, and fried foods at home or outside can cause many illnesses. See the link below for more information
It can cause pimples, scars, hair loss, eye problems, being overweight, being lethargic all day, loss of energy, skin rashes, heart, liver and kidney problems. Toxins in the body are produced by contaminants and sprayed with pesticides during harvesting. Injections are given to ripen the fruit quickly without pesticides during harvesting. Urine is excreted in the form of sweat to cleanse our body. But not on a full scale. And let's see what can be done to make the body completely detoxified
Aloe Vera Juice: Aloe vera juice is high in laxative anti-inflammatory properties. This increases the amount of good bacteria needed for digestion. Improves digestion. The fiber in it stops the growth of body fat. Increases immunity. Aloe vera should be part of the diet to increase digestion and keep the skin radiant
Wheatgrass juice: - It contains many nutrients. It is rich in beta carotene, vitamin V, C, 90 types of minerals and 18 types of amino acids. Lettuce contains a higher percentage of iron than iron. And it contains 70 percent chlorophyll. It should be taken three days a week i.e. daily in March. Improves blood circulation and reduces heart disease. This purifies the blood and reduces the appearance of pimples. It also reduces overweight.
Beetroot: - Beetroot is rich in Calcium, Iron, Potassium, Magnesium, Vitamin C and Phosphorus .It is high in dietary detoxification.
Green Tea: - Natural green tea infusion cleanses the body. Coconut water also cleanses the body. Mixing apple cider vinegar with water can also help cleanse the body, no matter how inedible it may be. Also a forty minute walk exercise daily can cleanse the body and help with health