British researchers spend the morning checking out Corona with an active walk. They say the habit of walking in the morning reduces the risk of dying from Kovid-19. It is also said that the age of living increases.
Professor Tom Yates, of the University of Leicester in the United Kingdom, researched the morning walk. The effect of the corona virus on the morning brisk walk was found to be negligible. It was also concluded that the age of these is declining. The living age of these is said to increase to 20 years. Because fast movement keeps the heart muscle healthy. So that oxygen can be used better. According to a 2015 study published in The American Journal of Clinical Nutrition, 20 minutes of active walking every day reduces the risk of death by 30 percent.
There are situations where the corona causes you to go outside and not walk or exercise. That is why it is better to walk at home. Climbing and walking on the terrace of the house in the morning gives good oxygen to the body organs. One should also make arrangements to receive vitamin D from sunlight on the other hand while exercising on the one hand. Vitamin D can be obtained by staying in the sun between 6am and 9pm in the morning and again between 4pm and 6pm.
Walk home .. Avoid this mistake
Keeping the arm upright:
According to research by The General of Experimental Biology, walking with the arms straight may slow down. The results of the walk can only be achieved by rotating the arms 90 degrees and bending the elbows close to the body.
Bending:
Be careful not to bend the neck while walking. This bending can cause injury to the body, said Florida racewalking coach Bonnie Stein. Keep the neck straight during the walk. Doing so also keeps the spine upright. Keep a range of 10 to 30 feet while walking.
Longer steps:
Be careful not to take long steps while walking. So long feet come forward to the center of gravity and cause damage to the knee. The result is pain as well as a loss of balance.
Keeping the feet flat:
Make sure the ankle touches the ground first when running. Afterwards roll the feet and come to the ground. There will be a problem in energy transfer from flat feet. At the same time the problem of foot pain also increases
ఉదయం పూట చురుకైన నడకతో కరోనాకు చెక్ పెట్టొచ్చని సెలవిస్తున్నారు బ్రిటన్ పరిశోధకులు. ఉదయం పూట నడిచే అలవాటు కొవిడ్ -19 నుంచి మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని వారు చెప్తున్నారు. అలాగే జీవించే వయసు కూడా పెరుగుతుందని సెలవిస్తున్నారు.
బ్రిటన్‌లోని లీసెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ టామ్ యేట్స్ ఉదయం పూట చేసే చురుకైన నడకపై పరిశోధనలు జరిపారు. ఉదయాన బ్రిస్క్ వాక్ అలవాటు ఉన్నవారిలో కరోనా వైరస్ ఎలాంటి ప్రభావం చూపదని గుర్తించారు. వీరిలో వయసు తగ్గిపోతుందని కూడా తేల్చారు. వీరిలో జీవించి ఉండే వయసు 20 సంవత్సరాల వరకు పెరుగుతుందని పేర్కొన్నారు. ఎందుకంటే వేగంగా కదలిక గుండె మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తద్వారా ఆక్సిజన్‌ను బాగా ఉపయోగించుకోవచ్చు. 2015 లో ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ 20 నిమిషాల చురుకైన నడక మరణ ప్రమాదాన్ని 30 శాతం తగ్గిస్తుంది.
కరోనా కారణంగా బయటకు వెళ్లి వాకింగ్, వ్యాయామం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇంటి వద్దనే వాకింగ్ చేయడం మంచిది. ఉదయాన్నే ఇంటి డాబాపైకి ఎక్కి వాకింగ్ చేయడం వలన శరీర అవయవాలకు మంచి ఆక్సిజన్ అందుతుంది. ఒకవైపు వ్యాయామం చేస్తూనే మరోవైపు సూర్యరశ్మి నుంచి డీ విటమిన్ అందుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు, తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సూర్మరశ్మిలో నిలుచోవడం ద్వారా డీ విటమిన్ పొందవచ్చు.
చేయి నిటారుగా ఉంచడం:
ది జనరల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీ పరిశోధన ప్రకారం, చేతులను నిటారుగా పెట్టి నడవడం వలన నడకలో వేగం తగ్గుతుంది. 90 డిగ్రీల వరకు చేతులు తిప్పి, మోచేతులను శరీరానికి దగ్గరగా వంచడం ద్వారా మాత్రమే నడకలో ఫలితాలను సాధించవచ్చు.
బెండింగ్:
నడిచేప్పుడు మెడను వంచకుండా చూసుకోవలి. ఈ బెండింగ్ శరీరానికి గాయం కలిగిస్తుందని ఫ్లోరిడా రేస్‌వాకింగ్ కోచ్ బోనీ స్టెయిన్ చెప్పారు. నడకలో మెడను సూటిగా ఉంచాలి. ఇలా చేయడం వెన్నెముకను కూడా నిటారుగా ఉంచుతుంది. నడుస్తున్నప్పుడు 10 నుండి 30 అడుగుల పరిధిని గమనిస్తూ ఉండాలి.
పొడవైన అడుగులు వేయడం:
నడిచేప్పుడు పొడవైన అడుగులు వేయకుండా చూసుకోవాలి. అలా పొడుగాటి అడుగులు గురుత్వాకర్షణ కేంద్రానికి ముందుకు వచ్చి మోకాలికి నష్టం కలిగిస్తుంది. ఫలితంగా నొప్పితోపాటు సమతుల్యత క్షీణిస్తుంది.
పాదాలను చదునుగా ఉంచడం:
నడుస్తున్నప్పుడు చీలమండను నేలపై మొదట తాకేలా చూసుకోవాలి. అనంతరం పాదాలు రోల్ చేసి నేలమీదకు రావాలి. ఫ్లాట్ అడుగుల నుంచి శక్తి బదిలీలో సమస్య ఉంటుంది. అదే సమయంలో పాదాల నొప్పి సమస్య కూడా పెరుగుతుంది