English
1. Some of the cool drinks and other sweet drinks are drinking as you know how to exercise regularly. Choose a low-calorie vegetable juice instead. The weight is controlled. Add a glass of lemon juice in a glass of water as well. This may not be to eat high calorie foods. Doing this will reduce weight. Get rid of alcohol also. Alcohol causes the calorie intake in the body. So if you stop alcohol, it is very close to the goal that you lose weight.
2. People who have a weight loss should usually focus on eating foods. Eat what you eat and eat what you eat. Along the way, you should start taking more vegetables and soups. They are good for health. Stomach filled feeling. It is better not to go to a calorie diet.
3. Some people say that it is time to get hungry. Do not eat it. Eat only if you have hunger. It should be eaten only up to hunger. Can not eat too much. Pay attention to each paste. Otherwise, most of the food is eaten. Weight control is lost.
4. Chicken or mutton eat only one or two times a week. Eat more fish if possible. This may result in overweight loss.
5. Junk food, eaten with oils, pizzas, and burgers, was eaten by the evening as it was hungry. Instead of eating almonds, cashew nuts, pistachio and pumpkin seeds, the nutrients are available to the body. Weight can also decrease.
6. Whenever the food is eaten, make sure the protein is perfect. Take pulses, nuts, beans, and eggs in the diet.
7. Some say we lose weight in the morning to lose weight. But the fact is that by doing so much food in the rest of the day. The researchers say that they do so. So breakfast should be done in the morning. Do not stop it. Or eat more than breakfast at other times of the day. The result will increase the weight.
8. Studies have shown that if you take less than 10 to 20 percent of the dietary food you eat regularly, the overweight can decrease rapidly. Dieticians say weight can be eaten by eating precise measurements as well. That is what you need. It is the exact measure of daily eating.
Telugu
అధికంగా బరువు ఉన్నవారు దాన్ని తగ్గించుకోవడం కోసం బాగానే శ్రమిస్తుంటారు. నిత్యం వ్యాయామం చేయడం, సరైన సమయానికి పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవడం తదితర చర్యలతో బరువు తగ్గాలని చూస్తుంటారు. అయితే వాటితోపాటు కింద సూచించిన విధంగా పలు సూచనలు పాటిస్తే దాంతో అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. ఈ సూచనలతో మీ జీవనశైలిలో చిన్నపాటు మార్పులు చేసుకుంటే బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. నిత్యం ఎలాగూ వ్యాయామాలు చేస్తున్నాం కదా అని చెప్పి కొందరు కూల్ డ్రింక్స్, ఇతర తీపి పానీయాలను తాగుతుంటారు. వాటికి బదులుగా తక్కువ క్యాలరీలు ఉండే వెజిటబుల్ జ్యూస్‌లను ఎంచుకోండి. దాంతో బరువు కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఆకలిగా అనిపిస్తే ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగేయండి. దీని వల్ల అధిక క్యాలరీలు ఉండే ఆహారాలను తినకుండా ఉండవచ్చు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు. దీంతోపాటు మద్యం సేవించడం కూడా మానేయండి. మద్యం వల్ల శరీరంలో క్యాలరీలు ఎక్కువగా చేరుతాయి. కనుక ఆల్కహాల్‌ను మానేస్తే అధిక బరువును తగ్గించుకోవడమే గోల్‌కు మీరు చాలా దగ్గరైనట్టే.
2. సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు ఎవరైనా తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అని గమనించి తినాలి. అలాగే ఎక్కువగా కూరగాయలు, సూప్స్‌ను తీసుకోవడం ప్రారంభించాలి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కడుపు నిండిన భావనను కలగజేస్తాయి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం వైపు చూడకపోవడమే మంచిది.
3. కొందరు ఆకలి లేకున్నా టైం అయింది కదా అని చెప్పి తింటారు. అలా తినరాదు. ఆకలి ఉంటేనే తినాలి. అది కూడా ఆకలి తీరే వరకు మాత్రమే తినాలి. అతిగా తినరాదు. తినే ప్రతి ముద్దపై దృష్టి పెట్టాలి. లేదంటే ఎక్కువగా ఆహారం తింటారు. బరువు కంట్రోల్ తప్పిపోతారు.
4. చికెన్ లేదా మటన్ ఏదైనా సరే వారంలో ఒకటి, రెండు సార్లు మాత్రమే తినండి. వీలైతే వీటికి బదులుగా చేపలను ఎక్కువగా తినండి. దీంతో అధిక బరువు త్వరగా తగ్గవచ్చు.
5. సాయంత్రం సమయంలో ఆకలిగా ఉందని చెప్పి నూనెతో చేసిన పదార్థాలు, పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తింటారు. వాటికి బదులుగా బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, గుమ్మడికాయ విత్తనాలను తినడం అలవాటు చేసుకుంటే శరీరానికి పోషకాలు లభిస్తాయి. మరో వైపు బరువు కూడా తగ్గవచ్చు.
6. రోజూలో ఆహారం ఎప్పుడు తిన్నా అందులో ప్రోటీన్ కచ్చితంగా ఉండేలా చూసుకోండి. పప్పులు, నట్స్, బీన్స్, కోడిగుడ్లు తదితరాలను ఆహారంలో తీసుకోండి.
7. కొందరు బరువు తగ్గాలని చెప్పి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను మానేస్తారు. కానీ నిజానికి అలా చేయడం వల్ల రోజులో మిగిలిన భాగంలో అధికంగా ఆహారం తీసుకుంటారట. అలా అని చెప్పి పరిశోధనలే చెబుతున్నాయి. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. దాన్ని మానేయకూడదు. లేదంటే రోజులో ఇతర సమయాల్లో బ్రేక్‌ఫాస్ట్ కన్నా అధికంగా తింటారు. ఫలితంగా బరువు పెరుగుతారు.
8. మీరు రోజూ తినే ఆహారంలో 10 నుంచి 20 శాతం ఆహారం తక్కువగా తీసుకుంటే అధిక బరువు త్వరగా తగ్గవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే తినే ఆహారాన్ని కచ్చితమైన కొలతలతో తింటే బరువు తగ్గవచ్చని డైటిషియన్స్ చెబుతున్నారు. అంటే.. మీకు ఎంత అవసరమో అంతే ఆహారాన్ని తినాలి. దాన్ని కచ్చితమైన కొలతతో రోజూ అంతే తినాలన్నమాట.