ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు ఎవరు ఉండరు స్మార్ట్ ఫోన్ ఉన్నవారు వాట్సాప్ వాడనివారు ఉంటారు. వాట్సాప్ వాడే వారందరికీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటో మీరే చూడండి.ఈనాటి యువత రోజు తమ దినచర్య వాట్సాప్ మరియు పేస్ బుక్ ద్వారా మొదలు అవుతుంది.
వాట్సాప్:
ఇక వాట్సాప్ విషయానికి వస్తే వాట్సాప్ లో స్టేటస్ ఫీచర్ వాడుతున్నవారికి ఒక చేదు వార్త గంటకి ఒకసారి స్టేటస్ మార్చుస్తున్నవారికి ఇన్నాళ్లు ఎలాంటి యాడ్స్ లేవు కానీ ఇకపై యాడ్స్ కనిపించనున్నాయి అది కూడా మీరు తరుచు అప్ డేట్ చేసే స్టేటస్ ఫీచర్లో దర్శనమివ్వనున్నాయి.
డిమాండ్:
ప్రపంచంలో ఫుల్ డిమాండ్ ఉన్న యాప్ వాట్సాప్ దీని ఎవరు కాదు అనలేరు. ఈ యాప్ కి ఇంత డిమాండ్ ఉండడానికి కారణం మొదటి నుంచి దింట్లో యాడ్స్ లేకపోవడమే.ఏ యాప్ ఉపయోగించిన యాడ్స్ యూజర్లకి ఇబ్బంది పెడుతుంటాయి.కానీ వాట్సాప్ లో ఈ సమస్య ఉండేది కాదు యాడ్స్ లేవు కాబ్బటి వాట్సాప్ కి ఇంత క్రేజ్.
స్టేటస్:
ప్రస్తుతం ఐ ఓ ఎస్ మరియు ఆండ్రాయిడ్, పి.సి అలాగే విండోస్ ఫోన్లలో అందుబాటులో ఉంది ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో వస్తున్నట్లు వాట్సాప్ లో కూడా స్టేటస్ లో కూడా యాడ్స్ కనిపిస్తాయి. వాట్సాప్ ని పేస్ బుక్ సొంతం చేసుకున్నాక ఈ యాప్ పై యాడ్ రెవెన్యూ పై ద్రుష్టి పెట్టారు ఈ ప్రక్రియ 4 సంవత్సరాల నుంచి సాగుతున్నాయి.
యాడ్స్ సంస్థలు:
ఇప్పుడు వాట్సాప్ లో యాడ్స్ ని పేస్ బుక్ కి చెందిన యాడ్స్ సంస్థలు నడిపియనున్నాయి. అయితే యాడ్స్ ని చూపించడం ప్రైవసీ ని భంగపరచడం అని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండడం వల్ల మీ డేటా కి ఎలాంటి డోకా లేదు అని వాదన. డేటా ని యాక్సెస్ చేయకుండా యాడ్స్ చూపించడం సాధ్యం కాదు అని మరొక వాదన ఉంది వీటి పై వాట్సాప్ నుంచే స్పష్టత రావాలి.